Sunday, December 22, 2024

కడపలో అంగన్‌వాడీ కేంద్రానికి సిబ్బంది తాళం

- Advertisement -
- Advertisement -

Anganwadi center in Kadapa is locked by staff

కడప: అంగన్‌వాడీ వర్కర్లు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కడప జిల్లా ముండ్లవారి పల్లిలో చోటుచేసుకుంది. అంగన్‌వాడీ వర్కర్‌ రేణుక, అటెండర్‌ జయ చిన్నారులను సెంటర్‌కు తాళం వేసి బయటకు వెళ్లారు. రోదనలు విన్న చిన్నారుల తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని తమ పిల్లలను చూసి ఆందోళనకు దిగారు. పిల్లలకు ఏదైనా జరిగితే బాధ్యులెవరు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కేంద్రంలోని సమస్యలపై ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News