Monday, December 23, 2024

పేద కుటుంబాలకు అంగన్వాడీ కేంద్రాలు వరం

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్ వాడీ కేంద్రాలు పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐసీడీఎస్,అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు అంగంన్ వాడీ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్యా తరంగిణి టీచర్స్ మీట్‌కు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సంధర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… చిన్న తనంలోనే ప్రాథమిక విద్య అందించడంలో అంగన్ వాడీ టీచర్ల పాత్ర ఎంతో గొప్పదన్నారు.

గర్భీణీ స్త్రీలకు పోషక,పౌష్టిక ఆహారం అందించడంలో చేస్తున్న సేవలు అమోఘమన్నారు. అంగన్ వాడీ టీచర్లకు నూతన విద్యావిధానాలు అందించడంలో మెలుకవలు నేర్పించడంలో అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సేవలు గొప్పవని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మణ్ ప్రభాకర్,జిల్లా సంక్షేమ అధికారిణ్ పద్మావతి, ఐసీడీఎస్ అధికారిణి చంద్రకళ, సర్పంచ్‌మున్నూరు లక్ష్మయ్య, రుద్రారం ఎఁపీటీసీ రాజు,నాయకులు దసఱత్ రెడ్డి అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News