Saturday, December 21, 2024

మందుబాబులకు అడ్డాగా మారిన అంగన్వాడీ కేంద్రం

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మందుబాబులకు అడ్డాగా మారింది. అంగన్వాడి కేంద్రంలో మందుబాబులు ప్రతీ రోజు మద్యం సేవిస్తున్నారు. అంగన్వాడి కేంద్రంలో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మద్యం సీసాలు పగలగొడుతున్నట్లు అంగన్వాడి టీచర్ తెలిపారు. అంగన్వాడి కేంద్రంలోకి పోకిరీలు చొరబడి రాళ్లు, చిత్తు కాగితాలు పడేస్తున్నారని అంగన్వాడి సిబ్బంది ఆరోపణలు చేశారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News