Friday, January 17, 2025

అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పరీక్ష ఫలితాలు వెల్లడి

- Advertisement -
- Advertisement -

Anganwadi Supervisor result released

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని సమీకృత శిశు సంక్షేమ ప్రాజెక్టు (ఐసిడిఎస్)లో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను మహిళా శిశు సంక్షేమాభివృద్ధి సంస్థ విడుదల చేసింది. సూపర్‌వైజర్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి జనవరి 2న రాతపరీక్ష నిర్వహించగా.. మంగళవారం (18వ తేదీ) ఫలితాలను వెల్లడించారు. ఈ మేరకు సంస్థ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హల్‌టిక్కెట్ల నంబర్ల ఆధారంగా మార్కులను వెల్లడించారు. త్వరలోనే జోనల్, రిజర్వేషన్ వారీగా తుది జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News