Thursday, December 19, 2024

అంగన్వాడీ టీచర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలో అంగన్వాడీ టీచర్ దారుణ హత్య కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఏటూరు నాగారం మండలం, చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన రడం సుజాత (50) గత 30 సంవత్సరాలుగా తాడ్వాయి మండలం, కాటాపూర్‌లో అంగన్వాడీ టీచర్‌గా సేవలందిస్తున్నారు. ఎప్పటి లాగే మంగళవారం విధులు ముగించుకొని స్వగ్రామానికి బయలు దేరిన ఆమె రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. బుధవారం తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లిన గంగారం కాలనీవాసులు నాంపల్లి అడవిలో పెద్దగుట్ట సమీపాన మెడకు

స్కార్ఫ్ చుట్టి విగత జీవిగా పడి ఉన్న సుజాత మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. మృతురాలి కుమారుడు రణం చరణ్ ఫిర్యాదు మేరకు పస్రా సిఐ వి శంకర్ ఆధ్వర్యంలో తాడ్వాయి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మృతురాలి మెడలోని నాలుగు తులాల బంగారం, సెల్ ఫోన్ ఈపహరణకు గురైనట్లు తెలుస్తోంది. అంగన్వాడీ టీచర్ సుజాత మరణంతో ఇటు చిన్నబోయినపల్లి, అటు కాటాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News