Thursday, January 9, 2025

ఆటోలో ప్రయాణం… అంగన్వాడీ టీచర్ కు అంటుకున్న మంటలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆటోలో ప్రయాణిస్తున్న అంగన్వాడీ టీచర్‌కు మంటలు అంటుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీనివాస్‌నగర్‌లో అంగన్వాడీ టీచర్ తన స్నేహితురాలితో కలిసి ఆటోలోకి ఎక్కారు. మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంగన్వాడీ టీచర్ తీవ్రంగా గాయపడ్గా ఆమె స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తీవ్రంగా గాయపడిన అంగన్వాడీ టీచర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరు ఆటోలు వెళ్లిన దృశ్యాలు సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. తనపై పెట్రోల్ దాడి జరగలేదని, ఆటోలో వెళ్తున్నప్పుడు అగిపుల్ల వెలిగించడంతోనే మంటలు చెలరేగాయని అంగన్వాడీ టీచర్ పోలీసులకు తెలిపారు. టీచర్ స్నేహితురాలు ఎవరు అనేదానిపై విచారణ చేస్తున్నారు. ఆటోలో పెట్రోల్ బాటిళ్లు ఉన్నాయా? లేదా ఇతర కారణాలు వల్ల ఇది జరిగిందా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News