Monday, December 23, 2024

బాన్సువాడలో అంగన్‌వాడీ యూనియన్ కార్యాలయం

- Advertisement -
- Advertisement -

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నిర్మిస్తాం
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ: బాన్సువాడలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నూతన కార్యాలయం భవనంతో పాటు అంగన్‌వాడీ యూనియన్ కార్యాలయం నిర్మిస్తామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలో డివిజన్‌లోని అంగన్‌వాడీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. బాన్సువాడ మాత, శిశు ఆస్పత్రికి జాతీయ స్థాయి అవార్డు రావడంతో అంగన్‌వాడీ టీచర్ల కృషి ఉందని, పేద గర్బిణీ స్త్రీలకు అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు.

ఈ సందర్బంగా అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షురాలు మహాదేవి, వజ్ర, పుష్ప, విజయ, సవిత, తయ్యాభాను, రేణుక తదితరులు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి, సీఎం కేసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహాయ, సహకారాలతో నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్ర నూతన భవనాలు, మహిళల అభివృద్దికి ‚అనేక విధాలుగా కృషిచేస్తున్నారన్నారు. అనంతరం స్పీకర్‌కు అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News