Monday, December 23, 2024

అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్‌సి ఉంటుంది: సత్యవతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్ వాడీ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని ధర్నా చేస్తున్న సందర్భంగా సత్యవతి మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె సరైనది కాదని, ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను సిఎం పరిష్కరిస్తారని, రూ.4200 ఉన్న జీతాన్ని రూ.7500లకు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రస్తుతం రూ.13850 జీతం అందుతోందని, ఆయాల జీతంలో కేంద్రం వాటా కేవలం రూ.1350 మాత్రమేనని సత్యవతి చెప్పారు. తెలంగాణలో అందుతున్న అంగన్‌వాడీ సేవలపై కేంద్రం నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని కొనియాడారు. అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్‌సి ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Also Read: మహిళా కానిస్టేబుల్‌పై దాడి: నిందితుడి ఎన్‌కౌంటర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News