Friday, November 22, 2024

వికిపీడియా పై ఏఎన్ఐ పరువు నష్టం కేసు

- Advertisement -
- Advertisement -

పరిహారంగా రూ. 2 కోట్ల డిమాండ్

న్యూఢిల్లీ: ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ప్రచారం చేసిందన్న విమర్శ చేసినందుకు గాను ఏఎన్ఐ వార్తా సంస్థ వికిపీడియా పై పరువు నష్టం కేసు వేసింది. వికిపీడియా తన ఆర్టికల్ లో ఏసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) ‘ కేంద్ర ప్రభుత్వానికి ప్రచారకర్తగా వ్యవహరించిందని, తన అతి పెద్ద నెట్ వర్క్ నుంచి ప్రచార సామాగ్రి అందించిందని, విషయాలను తప్పుగా నివేదించింది’ అని ఏఎన్ఐ ఆరోపించింది. ఇందుకు పరువు నష్టం కేసు వేసి, పరిహారంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసింది.

ఏఎన్ఐ తరఫున న్యాయవాది సిద్ధాంత్ కుమార్ కోర్టుకు హాజరయ్యారు. ఆయన వికిపీడియా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. కాగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దీనికి ప్రతిస్పందిస్తూ ‘వికిపీడియాకు తన స్వంత అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంటుంది’ అని నోటి మాటగా తెలిపారు. అయితే ఢిల్లీ హై కోర్టు వికిపీడియాకు సమ్మన్లు జారీ చేసింది.పరువునష్టం దావా పై ప్రతిస్పందించాలని కోరింది.వికిపీడియా వాదనను కోర్టు విననున్నది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News