Monday, December 23, 2024

బిజెపిలో చేరిన ఎకె ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని కుమారుడు అనిల్ కె ఆంటోని గురువారం కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, వి మురళీధరన్ సమక్షంలో బిజెపిలో చేరారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన డిజిటల్ మీడియా సెల్‌కు చైర్మన్‌గా వ్యహరించి ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టి జనవరిలో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అనిల్ ఆంటోని రాజీనామా చేశారు.

బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వం ఒకే ఒక్క కుటుంబం కోసం పనిచేస్తోందే తప్ప యావద్దేశం కోసం కాదంటూ విమర్శించారు. ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదని, భిన్నాభిప్రాయలు, భిన్న సిద్ధాంతాలకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు. సరైన చర్యే తీసుకున్నానని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. తన తండ్రి పట్ల గౌరవంలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News