ఎంపి అరవింద్ కుమార్ హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు
కెసిఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదు
ఎఫ్ డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపి అరవింద్ కుమార్ హద్దు మీరి ప్రవర్తిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పైన వారి కుటుంబసభ్యులు మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత పైన చేసిన వ్యక్తిగత విమర్శలని ఎఫ్ డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. ఎంపిగా గెలిచి నాలుగు సంవత్సరాల నుంచి నిజామాబాద్ ప్రజలకు చేసింది ఏమి లేదు కానీ రోజు రోజుకి కెసిఆర్ కుటుంబంపై ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలు మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ప్రజల కోసం తీసుకొచ్చిన భీమా పథకాన్ని విమర్శిస్తూ కెసిఆర్ వారి కుటుంబ సభ్యులు చావాలని కోరుకోవడం చాలా దారుణమై విషయమని, ఇది అరవింద్ లో ఉన్న ఉన్మాదాన్ని తెలియజేస్తుందని చురకలంటించారు. ఇలాగే ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో ప్రజలు చెప్పులతో సమాధానం చెప్తారని, ఇలాగే విమర్శలు చేస్తే ఊరుకొనేది లేదని అనిల్ కూర్మాచలం హెచ్చరించారు.