Thursday, January 23, 2025

జైలులో అనిల్ దేశ్‌ముఖ్‌కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Anil Deshmukh collapses in jail

జెజె ఆసుపత్రికి తరలింపు

ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ శుక్రవారం జైలులో స్పృహతప్పడంతో ఆయనను వెంటనే ప్రభుత్వ నిర్వహణలోని జెజె ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు. అవినీతి కేసులో ఇక్కడి ఆర్థర్ రోడ్ జైలులో జుడిషియల కస్టడీలో ఉన్న దేశ్‌ముఖ్ శుక్రవారం ఉదయం కళ్లు తిరిగి పడిపోయారని ఆ అధికారి తెలిపారు. ఛాతీ నొప్పి ఉన్నట్లు కూడా దేశ్‌ముఖ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆయన బిపి లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన, ఇసిజి రిపోర్ట్ కూడా అసాధారణంగా ఉందని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. అవినీతి ఆరోపణలపై 2021 నవంబర్‌లో ఎన్‌సిపికి చెందిన దేశ్‌ముఖ్‌ను ఇడి అరెస్టు చేసింది. ఆ తర్వాత సిబిఐ కూడా ఆయనను అరెస్టు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News