- Advertisement -
ముంబయి: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కస్టడీ కాలాన్ని ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ శుక్రవారం ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నవంబర్ 1వ తేదీన ఎన్‌సిపి నాయకుడైన అనిల్ దేశ్‌ముఖ్‌ను ఇడి అరెస్టు చేసింది. దేశ్‌ముఖ్‌ను తమకు అప్పగించాలని ఇడి చేసుకున్న అభ్యర్థనను ప్రత్యేక కోర్టు నవంబర్ 6న తోసిపుచ్చుతూ ఆయనను జుడిషియల్ రిమాండుకు పంపించింది. అయితే మరుసటి రోజున ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన బొంబాయి హైకోర్టు దేశ్‌ముఖ్‌ను నవంబర్ 12వ తేదీవరకు ఇడి కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం దేశ్‌ముఖ్‌ను పిఎంఎల్‌ఎ కోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎస్ సత్భాయ్ ఎదుట హాజరుపరచగా ఆయన ఇడి కస్టడీని నవంబర్ 15 వరకు న్యాయమూర్తి పొడిగించారు.
- Advertisement -