Thursday, January 23, 2025

దుఃఖం ఆపుకోలేకపోయిన నటుడు అనిల్ కపూర్!

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల కీశే. సతీశ్ కౌశిక్ 67వ జయంతి వేడుకలను ‘సతీశ్ కౌశిక్ నైట్’ పేరిట నిర్వహించారు. ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు బంధుమిత్రులందరూ హాజరయ్యారు. ఆయన కౌశిక్ జ్ఞాపకాలను గుర్తు చేసినప్పుడు అభిమానుల హృదయాలు చలించిపోయాయి. కౌశిక్ కూతురు వంశిక తన తండ్రి ఉత్తరాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించింది. తాను తన తండ్రిని అనుదినం మిస్ అవుతున్నానని పేర్కొంది. ఈప్పుడు ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అనుపమ్ ఖేర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్‌ను స్టేజి మీదికి ఆహ్వానించినప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. సతీశ్ కౌశిక్ గురించి మాట్లాడుతూనే అనుపమ్ ఖేర్ మధ్యలో అనిల్ కపూర్‌ని స్టేజి మీదకు ఆహ్వానించారు. వెళ్లాల, వద్దా అన్న ఊగిసలాటలో పడిపోయారు అనిల్. మొదట స్టేజిపైకి వెళ్లేందుకు ముందుకు వచ్చినా తర్వాత మెట్లు దిగేశారు. అంతేకాదు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. వెనక్కి వచ్చేసి తన సీట్లో కూలబడిపోయారు. అనిల్ కపూర్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. తాను అనుపమ్ ఖేర్‌తో స్టేజి పంచుకోలేనని, కార్యక్రమాన్ని కొనసాగించమని అనిల్ కపూర్ విన్నవించుకున్నారు. ఈ పరిస్థితిని చూసిన అనుపమ్ ఖేర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే తన ఉద్వేగాన్ని ఆపుకోలేక ‘రా…అనిల్. హిరోలు ఏడుస్తారు. మిత్రులూ ఏడుస్తారు. రా’ అన్నారు. అయితే ఆయన కూడా బోరుమన్నారు. తర్వాత ‘అనిల్ నువ్వు పిచ్చోడివి. నేనయితే నిభాయించుకుని పోతున్నాను’(అనిల్ తూ పాగల్ హై. మై టీక్ టాక్ జా రహా థా) అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News