Monday, December 23, 2024

బిజెపిలోకి ఎందుకు పోతున్నావు దాసోజు: అనిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దాసోజు శ్రవణ్ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? అని మాజీ ఎంఎల్ఎ ఈరవర్తి అనిల్ ప్రశ్నించారు. ప్రజారాజ్యంలో దాసోజుకు చిరంజీవి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణలో బిసి నాయకుడిగా మద్దతు ఇచ్చారని, సామాజిక న్యాయం లేదని గతంలో ప్రజారాజ్యం పార్టీపై రాళ్లతో దాడి చేయించావని ఘనత దాసోజు శ్రవణ్ దక్కుతుందన్నారు. అక్కడి నుంచి టిఆర్ఎస్ పార్టీ లో మౌత్ పీస్ గా మారావని ఈరవర్తి అనిల్ మండిపడ్డారు. కెసిఆర్ బాగా మద్దతు ఇవ్వడంతో మీడియాలో ఎక్కువగా కనిపించేవాడివని, భువనగిరి టిక్కెట్ ఇవ్వకపోవడంతో టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరావన్నారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఎఐసిసి స్పోక్స్ పర్సన్ గా గుర్తింపు వచ్చిందని, దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి  తరహాలో కాంగ్రెస్ పార్టీ దాసోజు గౌరవించిందన్నారు.

బలహీన వర్గానికి చెందిన దాసోజుకు ఎక్కడ తక్కువ చేయలేదని, రేవంత్ వచ్చాక నీ పదవీ తక్కువ చేశారా? అని ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్ ఖైరతాబాద్ టికెట్ ఇచ్చి గౌరవించిందని, 2007 నుంచి రోహిన్ రెడ్డి కాంగ్రెస్ పని చేస్తున్నా దాసోకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం గౌరవం అని పార్టీ వీడడం సబబుకాదని ఈరవర్తి అనిల్ హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఇడి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడ్తుంటే ఎప్పుడైనా ధర్నాలో పాల్గొన్నావా? అని ప్రశ్నించారు. నమ్మక ద్రోహివి, అవకాశవాదివని,  అప్పుడు చిరంజీవిని, సిఎం కెసిఆర్ ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బయటకు పోతున్నావని ఈరవర్తి అనిల్ మండిపడ్డారు. నీకంటే తాను సీనియర్  లీడర్ నని, మాజీ ఎమ్మెల్యేగా, విప్ గా పనిచేశానని, పిఆర్పీ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పటి నుండి తనకు ఎలాంటి పదవులు రాలేదన్నారు. బిజెపిలోకి ఎందుకు పోతున్నావో చెప్పాలని నిలదీశారు.  నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు పోతున్నావా? అని అడిగారు. పాలు, పెరుగుకు జిఎస్టి వేసినందుకు పోతున్నావా? అని ప్రశ్నించారు.  అదానీ, అంబానీలకు ప్రధాని మోడీ మద్ధతు ఇస్తున్నారని వెళ్తున్నావా? నిలదీశారు. దేని కోసం బిజెపిలోకి వెళ్తున్నావో చెప్పాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News