- Advertisement -
అమరావతి: టిడిపి యువ నేత లోకేష్ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని ఎంఎల్‌ఎ అనిల్ తెలిపారు నెల్లూరు వెంకటేశ్వరపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసిపి ఎంఎల్‌ఎ అనిల్ పూజలు చేశారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో ఎంఎల్‌ఎ అనిల్ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను చేసినంత దైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. తాను అపదలో ఉన్నవారికి సహాయం చేశాను కానీ అక్రమాస్తులు కూడబెట్టలేదన్నారు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎలా అవుతుందని అడిగారు. తాను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడని పేర్కొన్నారు.
Also Read: ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు… మూడు బోగీలు దగ్ధం.. వీడియో
- Advertisement -