బెంగళూరు: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ సారధి విరాట్ కోహ్లీపై అనిల్ కుంబ్లే సంచలన ఆరోపణలు చేశాడు. అంబటి రాయుడుకు కోహ్లీ, శాస్త్రి తీవ్ర అన్యాయం చేశారని, 2019 వరల్డ్ కప్ జట్టులో అతను ఆడాల్సి ఉండేనని, అయితే కోహ్లీ, శాస్త్రి వల్లనే సెలెక్టర్లు తుది జట్టులో స్థానం కల్పించలేదని కుంబ్లే తీవ్రంగా మండిపడ్డాడు. రాయుడు ప్రతిభ కలిగిన క్రికెటర్ అని, కెరీర్ ప్రారంభంలో అతని ఆట తీరును చూస్తే సచిన్ వంటి స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతాడనుకున్నానని, అతని టాలెంట్‌కు తగిన అవకాశాలు టీమిండియాలో దక్కలేదన్నాడు. రాయుడు 2019 ప్రపంచకప్‌లో ఆడాల్సిందన్నాడు. వరల్డ్ కప్ కోసమే అతన్ని నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం చేశారని గుర్తుకు చేశాడు.
కానీ వరల్డ్ కప్ టీమ్‌లో అతని పేరు లేకపోయే సరికి ఆశ్చర్యపోయానన్నాడు కుంబే. కాగా, ఈ వాఖ్యలకు సంబంధించి నెట్టింల్లో వైరల్‌గా మారాయి. భారత జట్టు తరపున 55 వన్డేలు ఆడిన అంబటి రాయుడు 1694 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 10 అర్థ సెంచరీలు ఉన్నాయి. 7 టి20ల్లో 61 పరుగులు చేశాడు. 203 ఐపిఎల్ మ్యాచుల్లో 4348 రన్స్ కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్థ సెంచరీలు ఉన్నాయి.