Monday, December 23, 2024

ఎక్కువ గ్లామర్, ఎక్కువ ఫన్‌గా ‘ఎఫ్ 3’

- Advertisement -
- Advertisement -

Anil Ravipudi interview about F3 Movie

“తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్‌ని చేశాం. ‘ఎఫ్ 2’ బిగ్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ‘ఎఫ్ 2’లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ‘ఎఫ్ 3’లో మనీ ఫస్ట్రేషన్. ‘ఎఫ్ 3’ అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారు” అని అన్నారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ’ఎఫ్ 3’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్‌గా…
‘ఎఫ్ 2’లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ‘ఎఫ్ 3’లో మనీ ఫస్ట్రేషన్. ఇది ఇంకా కనెక్ట్ అయ్యే పాయింట్. డబ్బు చుట్టూ వుండే ఆశ, అత్యాశ, కుట్ర, మోసం ఇవన్నీ హిలేరియస్‌గా వర్క్ అవుట్ అయ్యాయి. ‘ఎఫ్ 2’ సక్సెస్‌తో ఆర్టిస్టలందరూ మంచి ఎనర్జీతో పని చేశారు. సునీల్, మురళీ శర్మ, అలీ… ఇలా కొంత మంది ఆర్టిస్ట్‌లు కొత్తగా యాడ్ అయ్యారు. మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్‌గా వుంటుంది ‘ఎఫ్ 3’.
ఛాలెజింగ్‌గా అనిపించింది…
వెంకటేష్ పాత్ర రేచీకటిగా వరుణ్ తేజ్ పాత్ర నత్తిగా ఉంటే ఎక్కువ ఫన్ చేయొచ్చనిపించి ఈ క్యారెక్టరైజేషన్స్ యాడ్ చేశాం. అయితే అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా వుండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం. వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే వుంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమాలో దాదాపు 30 చోట్ల ఆ మేనరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా వుంటుంది. ఇది నిజంగా ఛాలెజింగ్‌గా అనిపించింది.
ఫైనల్ కంటెంట్ నచ్చుతుంది…
ట్రైలర్‌లో చూసినట్టు హీరోయిన్స్‌కి అత్యాశే కాదు ఇందులో ప్రతి పాత్ర అత్యాశగానే వుంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాదించాలనే ఆశతోనే వుంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో వుంటుంది. ఎంత ఫన్ వుంటుందో అంత మంచి కంటెంట్ వుంటుంది. ఎఫ్ 2లో ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది.
ఆ పాత్రలకు వారే కరెక్ట్…

ఎఫ్ 2’తో పోల్చుకుంటే ‘ఎఫ్ 3’లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తక్కువే. ‘ఎఫ్ 3’లో అంతా డబ్బు చుట్టూ తిరిగే కంటెంట్ ఉంటుంది. ట్రైలర్ లో కనిపించిన బంగారం షాపు సీన్ అందరి లైఫ్‌లో ఉండేదే. అయితే దీన్ని కొంచెం ఫన్‌గా చేశాం. ఇక ఇందులో వుండే నటులు ఆ పాత్రలకు వారే కరెక్ట్ అనిపించింది. సునీల్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ళ తర్వాత ఆయన హిలేరియస్ రోల్ చేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ సునీల్‌ని చూస్తాం. అలీది కూడా అద్భుతమైన పాత్ర. టెర్రిఫిక్‌గా చేశారు.
స్పెషల్‌గా ఉండాలని…
పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత పూజా హెగ్డే ఈ సినిమాలో యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్‌తో ’ఊ హ ఆహా ఆహా’ పాటని తీశాం. ఆతర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్‌గా వుండాలని ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్‌గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజా హెగ్డేగా వస్తుంది తను.
నెక్స్ మూవీస్…
బాలయ్య సినిమాతో సెప్టెంబర్, అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్తాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. బాలకృష్ణ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో ఆ పవర్‌కి తగ్గట్టే సినిమా వుంటుంది. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్‌లోకి వస్తాం.

Anil Ravipudi interview about F3 Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News