Wednesday, January 22, 2025

గొప్ప థియేటర్ అనుభూతినిచ్చే ‘ఏజెంట్’..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏజెంట్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఏజెంట్ భారీ స్పాన్ వున్న సినిమా. స్పై సినిమా అనగానే అవుట్ డోర్ వుంటుంది. అన్నీ విదేశీ లోకేషన్స్. యాక్షన్స్ సీన్స్, కోరియోగ్రఫీ చేసిన తర్వాత, ఎడిటింగ్ చేసిన తర్వాత మార్పులు వస్తే కష్టం. మామూలు ఎంటర్‌టైనర్స్, డ్రామా మూవీలలో చిన్న చిన్న తప్పులు వుంటే సర్దుకుపోవచ్చు.

‘ఏజెంట్’లాంటి మూవీకి అది కుదరదు. అందుకే ఈ సినిమా పూర్తవడానికి చాలా సమయం పట్టింది.  ‘ఏజెంట్’ యాక్షన్ ఫిల్మ్. కథ భిన్నంగా వుంటుంది. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ ఇది. ఎమోషన్స్ కూడా బలంగా వుంటాయి. అఖిల్‌కి ఈ సినిమా ‘ఏజెంట్’కు ముందు, ‘ఏజెంట్’ తర్వాతలా వుంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉండి ఆశ్చర్యపరుస్తాయి. గొప్ప థియేటర్ అనుభూతినిచ్చే చిత్రం ఏజెంట్. ఏజెంట్ క్యారెక్టర్‌లో ఫన్ వుంటుంది.

ట్రైలర్‌లో చూసే వుంటారు. ప్రతీది ఎంజాయ్ చేస్తుంటాడు. నిర్మాతగా ‘ఏజెంట్’ నాకు విభిన్నమైన అనుభూతినిచ్చింది. చాలా ఒత్తిడిలో విడుదల చేస్తున్న సినిమా ఇది. ఒక రిలీజ్ డేట్‌ని లాక్ చేసి ఎలాగైనా ఆ డేట్ లో రావాలని అనుకున్నాం. ఆ డేట్ కోసం గత నెల రోజులుగా డే అండ్ నైట్ కష్టపడ్డాం. ఇక నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. స్పై జోనర్‌లో ఈ సినిమా వుంటుంది. చిరంజీవితో చేస్తున్న ‘భోళాశంకర్’ మూవీ యాక్షన్ జరుగుతోంది. ఆగస్ట్ 11న ఈ సినిమాను విడుదల చేస్తాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News