Sunday, January 19, 2025

విడుదలకు ముందే 6.4 కోట్లు కలెక్ట్ చేసిన ‘యానిమల్’!

- Advertisement -
- Advertisement -

రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన ‘యానిమల్’ మూవీ విడుదలకు ముందే 6.4 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న యానిమల్ పై రణబీర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ తోనూ సక్సెస్ సాధించిన సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి.

యానిమల్ లో రణబీర్ తోపాటు రష్మిక మందాన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నటించారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. దీనికి పోటీగా అదే రోజు విక్కీ కౌశల్ హీరోగా రూపొందిన శామ్ బహదూర్ కూడా విడుదల అవుతోంది.

యానిమల్ తొలి రోజు మల్టీప్లెక్సుల్లో టికెట్లన్నీ అడ్వాన్స్ బుకింగ్ లో అమ్ముడుపోయాయట. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ అడ్వాన్స్ టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయనీ, వీటిపై యానిమల్ నిర్మాతలు ఆరు కోట్ల రూపాయలకు పైగా  రూపాయలు సంపాదించారని ఓ ప్రముఖ సినీ వెబ్ సైట్ కథనం.

దేశవ్యాప్తంగా తొలి రోజు అడ్వాన్స్ టికెట్లపై యానిమల్ హిందీ వెర్షన్ రూ. 5.87 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 54.29 లక్షలు, తమిళ వెర్షన్ రూ. 33.4 లక్షలు వసూలు చేశాయట. ఈ విధంగా తొలి రోజు 20.9 లక్షల అడ్వాన్స్ టికెట్లపై 6.42కోట్ల రూపాయలు లభించినట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది.

Animal First Song Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News