Monday, January 20, 2025

యానిమల్ మొదటి రోజు కలెక్షన్లు చూస్తే కెవ్వు కేకే!

- Advertisement -
- Advertisement -

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి  వంగ దర్శకత్వంలో డిసెంబర్ 1న రిలీజైన యానిమల్ మూవీ మొదటిరోజు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రణబీర్ కపూర్, రష్మిక మందాన్న హీరోహీరోయిన్లుగా నటించిన యానిమల్… ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 116 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం. సెలవు రోజున కాకుండా ఇతర రోజుల్లో విడుదలైన ఒక హిందీ సినిమా ఇంతటి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ఇదే మొదటిసారి. యానిమల్ నిర్మాతలు ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘116 కోట్ల వసూలు’ అంటూ పెద్ద అక్షరాలతో రాసి ఉన్న రణబీర్ కపూర్ పోస్టర్ ను వారు షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News