Monday, December 23, 2024

‘యానిమల్’ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌ తో బిగ్గర్ బ్లాక్‌ బస్టర్‌ ను అందించాడు. తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసిన సందీప్, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ తో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ‘యానిమల్‌’ తో సౌత్, నార్త్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించనున్నాడు. భూషణ్‌కుమార్‌, ప్రణయ్ రెడ్డి వంగా తో కలిసి టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రణబీర్ కపూర్ మాన్‌ స్టర్‌ అవతార్ లో కనిపించారు. యానిమల్ సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, ఎమోషన్‌ తో కూడిన ఇంటెన్స్ డ్రామా. రణబీర్‌ ని తొలిసారిగా యాక్ న్‌ తో కూడిన పాత్రలో సందీప్ ప్రజంట్ చేస్తున్నాడు. పొడవాటి జుట్ట, రగ్గడ్ గడ్డంతో, రణబీర్ పదునైన గొడ్డలిని పట్టుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. అతని శరీరమంతా రక్తం ఉంది. ఆసక్తిని రేకెత్తించే ఫస్ట్ లుక్ పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. కేవలం ఇది ఫస్ట్ లుక్ పోస్టర్. అయితే ఈ పోస్టరే మాసీవ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం ఆగష్టు 11, 2023న ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా

నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా

బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్

పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News