Sunday, January 19, 2025

‘యానిమాల్’ రొమాంటిక్ సాంగ్.. రెచ్చిపోయిన రణ్‌బీర్, రష్మిక..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. ఈ మూవీని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘అమ్మాయి’ అనే రొమాంటిక్ ట్రాక్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఇందులో రణ్‌బీర్ కపూర్, రష్మిక లిప్ లాక్‌లతో రెచ్చిపోయారు. రాఘవ చైతన్య పాడిన ఈ సోల్ ఫుల్ మెలోడీకి అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మెలోడీ మాస్ట్రో ప్రీతమ్ మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News