Saturday, December 21, 2024

‘యానిమల్’ మూవీ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘యానిమల్’. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యాన‌ర్‌పై భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తుంది. గురువారం రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఇందులో క్లాస్ అండ్ మాస్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News