నాని హీరోగా.. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ సినిమా ‘హిట్-3’. ఈ సినిమాలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా పూర్తి వాయిలెంట్ పోలీస్ పాత్రలో నాని కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ‘తను’ అనే పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాడటం విశేషం.
గతంలో నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’, ‘జెర్సీ’ సినిమాలకు అనిరుధ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. త్వరలో విడుదల కానున్న నాని మరో సినిమా ‘ప్యారడైజ్’కి కూడా ఇతనే సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ పాట పాడటానికి అనిరుధ్ ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. నానితో ఉన్న బాండింగ్ వల్లే అనిరుధ్ పాట పాడటానికి డబ్బులు తీసుకోలేదట. ఇక వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా మే 1వ తేదీన విడదల కానుంది.