Monday, January 20, 2025

గుజరాత్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో కుల వివక్ష ఎదుర్కొన్నా

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్ : గిఫ్ట్ సిటీ లక్షానికి స్ఫూర్తి పొంది, సింగపూర్ కన్నా గుజరాత్‌ను ఎంచుకున్న జెపి మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ కేజ్రీవాల్ తాను ఆ ప్రాంతంలో గృహం కోసం అన్వేషణలో ఎదుర్కొన్న కుల వివక్షపై నిస్పృహ వ్యక్తం చేశారు. అనిరుధ్ కేజ్రీవాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. ఆయన తన పోస్ట్‌కు గుజరాత్ పోలీస్ శాఖ, గుజరాత్ బిజెపి, ముఖ్యమంత్రి, ఇతర సంబంధిత వ్యక్తులను జత చేశారు. ‘ముంబయిలో ఏళ్ల తరబడి నివసించిన తరువాత సింగపూర్‌లో ఒక అవకాశం వచ్చినా గుజరాత్‌కు తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. గిఫ్ట్ సిటీ వాగ్దానం, మన ప్రధాని బృహత్ కల, మా కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాటు నన్ను ఆకట్టుకున్నాయి.

నేను ఒక భారీ అడుగు ముందుకు వేసేలా అది నన్ను ప్రేరేపించింది. నా తొలి ఇంటిని ఇక్కడ కొనాలని నిశ్చయించాను. ఆశ, వృద్ధి కలగలసిన భవితను కల కన్నాను’ అని కేజ్రీవాల్ తన పోస్ట్‌లో తెలిపారు. భారత్‌లో ఇంకా కొనసాగుతున్న సమాజపు అడ్డుగోడలు గుర్తు చేస్తున్నాయని అంటూ ఆయన నిరాశ వ్యక్తం చేశారు.‘ఇంకా అధ్వానం ఏమిటంటే నేను ఇక్కడ చేరగలిగితే ఆనందం మటుమాయం అవుతుందని, ఇబ్బందులు తప్పవని నాకు హెచ్చరికలు వచ్చాయి’ అని ఆయన తెలిపారు. ‘ఈ అనుభవం ఒక పీడకల తప్ప మరేమీ కాదు. నేను ఎంతో ఆశలో ఎంచుకున్న చోట అంత బాహాటంగా కులతత్వం ఎదురుకావడవ వర్ణించలేనిది’ అని అనిరుధ్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News