Friday, December 27, 2024

స్పెషల్‌గా దేవర మూడో సాంగ్.. ఎన్టీఆర్, జాన్వీ ఇరగదీశారంట

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం ఈ 27వ తేదీన వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. బ్లాక్‌బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమై స్పందన వస్తోంది. ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవి చందర్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు. ఈ మూడో సాంగ్‌లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లు ఈ పాటలో బాగా ఆకట్టుకున్నట్లు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News