Wednesday, January 22, 2025

సౌత్‌ఈస్ట్, చాంద్రాయణగుట్ట డివిజన్ ఎసిపిగా అంజయ్య

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వస్థీకరణలో భాగంగా సౌత్‌ఈస్ట్ జోన్లో కొత్తగా ఏర్పాటు చేసిన చాం ద్రాయణగుట్ట డివిజన్ నూతన ఏసీపీగా సి.అంజయ్య నియమితులైయ్యారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ డివిజన్‌కు ఏసీపీని నియమించలేదు. ఇంచార్జ్ ఏసీపీగా మహ్మద్ గౌస్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిపిని డీఎస్‌పీ/ఏసీపీల బదిలీలలో రాచకొండ కమిషనరేట్, మహేశ్వరం డివిజన్ ఏసీపీ గా పనిచేస్తున్న సి.అంజయ్యను చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీగా నియమించారు.

ఈ డివిజన్ పరిధిలోకి వచ్చే చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్లకు పూర్తి స్థాయి ఇన్‌స్పెక్టర్లను నియమించారు. అయితే చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ఎం.ఎ.జావీద్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌గా పదోన్నతి పొం దారు. త్వరలో ఆ స్థానం ఖాళీకానుంది. సౌత్‌జోన్లో కొత్తగా ఏర్పడిన ఛత్రినాక డివిజన్‌కు ఏసీపీని నియమించాల్సి ఉంది. దీనికి మీర్‌చౌక్ ఏసీపీ దా మోదర్‌రెడ్డి ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ డివిజన్లోని మొఘల్‌పురా, ఛత్రినాక, శాలిబండ పోలీసుస్టేషన్లకు పూర్తి స్థాయి ఇన్‌స్పెక్టర్లను నియమించారు.
చార్మినార్ ట్రాఫిక్ ఎసిపి బదిలీ…
హైదరాబాద్ సిటీ సౌత్‌జోన్ ట్రాఫిక్ 4, ఏసీపీ కె.శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో సైబరాబాద్ కమిషనరేట్ బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్‌రెడ్డిని నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News