Sunday, September 8, 2024

అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Anjan Kumar Yadav resigns as Hyderabad Congress president

హైదరాబాద్: హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఠాగూర్ కు సమర్పించారు. రెండు సార్లు ఎంపిగా గెలిచానని, తనకు టిపిసిసి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన  కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు.  ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో టిపిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. ముఖ్యంగా భువనగిరి ఎంపి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్ పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే టిపిసిసి అధ్యక్ష పదవిని బిసిలకే ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. టిపిసిసి అధ్యక్ష పదవికి తాను అన్ని విధాల అర్హుడనని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి విన్నవించారు.

Anjan Kumar Yadav resigns as Hyderabad Congress president

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News