Wednesday, January 22, 2025

ఉచిత కరెంటుపై రోత వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి పాడె కట్టిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవసరాలపై కనీస అవగాహన కూడా లేని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరాపై రోత వ్యా ఖ్య లు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పాడె కట్టేశాడని రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ ఉచిత విద్యుత్ సరఫరాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు.

దశాబ్దాలపాటు కరువు, కరెంటు కష్టాల కోరలకు చిక్కి బలవన్మరణాల భూమిగా తెలంగాణ ప్రాంతం అనుభవించిన దారుణ దుస్థితి గురించి గాలివాటానికి కొట్టుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఎన్నటికీ అర్థం కాదని అన్నారు. ఆ దుస్థితిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయడానికి సిఎం కెసిఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తుంటే, రేవంత్ రెడ్డి రాబందులా మారి కరెంట్ వెలుగుల పై విషం కక్కడం దారుణమని దుయ్యబట్టారు. రైతు లోకమే పొలిటికల్ పశుపతి అయిన రేవంత్ రెడ్డికి రాళ్ళ దండలేయడం ఖాయమన్నారు. గ్రిడ్ ల అనుసంధానం తో పాటు సరఫరా వ్యవస్థ , కరెంటు ఉత్పత్తి తదితర సాంకేతిక సమస్య ల పరిష్కారం కోసం సిఎం కెసిఆర్ పడ్డ కష్టం తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ను వెక్కిరించడం ద్వారా, రాష్ట్ర రైతు లందరినీ రేవంత్ రెడ్డి అవమానించారని పాము ను పెంచుకుంటున్న హస్తం పార్టీ , దాని విషపు కాటుకే బలైపోతుందని ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News