Monday, December 23, 2024

మక్తల్ బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇంఛార్జీగా ‘శాట్స్’ చైర్మన్ ఆంజనేయ గౌడ్

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఏ చిట్టెంతో భేటీ

మన తెలంగాణ / హైదరాబాద్ : మక్తల్ నియోజక వర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌గా శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్‌ను బిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం నియమించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయనకు ఈ మేరకు ఎన్నికల బాధ్యతలను పార్టీ కట్టబెట్టింది. దీంతో తక్షణమే నియామక బాధ్యతలను చేపట్టి రంగంలోకి దిగిన డాక్టర్ ఆంజనేయ గౌడ్..శుక్రవారం మక్తల్‌లో ఎమ్మెల్యే స్వగృహంకు వచ్చి చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం తక్షణమే ఈ బాధ్యతలను స్వీకరించినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం ఎంఎల్‌ఏతోనూ, మండల పార్టీ అధ్యక్షులతోనూ ఆయన సమావేశమై నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి పరిస్థితులు, పార్టీ ప్రచార సరళిపై ఆంజనేయ గౌడ్ చర్చించారు. ఈ సమావేశంలో మక్తల్ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాగనూర్ మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మక్తల్ టౌన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అమర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News