Wednesday, January 22, 2025

రాష్ట్రానికి కొత్త డిజిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర డిజిపిగా అంజనీకుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఎసిబి, విజిలెన్స్ డిజిగా ఉ న్న ఆయనను ఇన్‌చార్జి డిజిపిగా బదిలీ చేస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌చార్జి డిజిపిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్ర స్తుత డిజిపి ఎం. మహేందర్‌రెడ్డి ఈ నెల 31న ప దవీ చేయనున్నారు. మరో ఐదుగురు ఐపిఎస్‌లను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాను ఎసిబి డిజిగా బదిలీ చేసి విజిలెన్స్ డిజిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. శాంతి భద్రతల అదనపు డిజి జి తేందర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. జితేందర్‌కు జైళ్లశాఖ డిజిగా అదనపు బాధ్యతలు  అప్పగించారు. రాచకొండ కమిషనర్‌గా పనిచేసిన మహేష్‌భగవత్‌ను సిఐడి డిజిగా బదిలీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు సిపిగా పనిచేసిన దేవేంద్రసింగ్ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా బదిలీ చేశారు.

సంజయ్‌కుమార్ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డిజిగా బదిలీ చేశారు. సంజయ్‌కుమార్‌కు అగ్నిమాపక శాఖ డిజిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. మరికొంతమంది ఐపిఎస్‌ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు జిల్లాల్లోనూ పలువురు ఐపిఎస్‌ల బదిలీలు అయ్యే అవకాశం ఉంది. 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ 2018 మార్చి 12న హైద్రాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టారు. చాలాకాలం పాటు ఈ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఎసిబి డిజిగా బదిలీ చేశారు. రాష్ట్ర డిజిపిగా మహేందర్ రెడ్డి రిటైర్ కానుండడంతో ముగ్గురు ఐపీఎస్ పేర్లను యూపిఎస్‌సికి ప్రభుత్వం పంపింది. అంజనీకుమార్ తో పాటు 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా , 1989 బ్యాచ్ కు చెందిన ఉమేష్ షరాఫ్ లు పేర్లు ప్రధానంగా విన్పించాయి. ఉమేష్ షరాఫ్ రిటైర్మెంట్ కు ఆరు మాసాలే సమయం ఉంది. రవిగుప్తా, అంజనీకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

చివరకు ప్రభుత్వం అంజనీకుమార్ వైపే మొగ్గు చూపింది. రాష్ట్ర డిజిపిగా ఉన్న అనురాగ్ శర్మ రిటైర్ కావడంతో మహేందర్ రెడ్డిని డిజిపిగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 1966 జనవరి 28న అంజనీకుమార్ జన్మించారు. ఢిల్లీ యూనివ ర్శిటీకి చెందిన కిరోరిమాల్ కాలేజీ, పాట్నాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఐపీఎస్ ట్రైనింగ్ సమయంలో అత్యు త్తమ హర్స్ రైడర్ గా అంజనీకుమార్ నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డిజిపి మహేందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో రెండు వారాలు సెలవు పెట్టడంతో ఇంచార్జీ డిజిపిగా అంజనీకుమార్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా, డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరొకర్ని ఎంపిక చేయాల్సి ఉన్నా పూర్తిస్థాయి నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అందుకు అనేక కారణాలున్నాయి.

యూపి మాజి డిజిపి ప్రకాశ్‌సింగ్ దాఖలు చేసిన కేసును విచారించిన సుప్రీంకోర్టు దేశంలో పోలీసు సంస్కరణలకు సంబంధించి 2006లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం అర్హులైన ఐదుగురు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపిఎస్‌సికి పంపాలి. యుపిఎస్‌సి ముగ్గుర్ని ఎంపిక చేస్తుంది. వారిలో ఒకర్ని డిజిపిగా నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ అమలవుతున్న దాఖలాలు లేవు. దీనిపై సుప్రీంకోర్టులో అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిపిని ఎంపిక చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ 2018లో ‘తెలంగాణ పోలీసు (సెలక్షన్ అండ్ అపాయింట్‌మెంట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌హెడ్ ఆఫ్ పోలీసు ఫోర్స్) యాక్ట్’ పేరుతో తెలంగాణ శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది. ఆ బిల్లు ప్రకారమే ప్రస్తుత డిజిపి ఎం.మహేం దర్‌రెడ్డి నియామకం జరిగింది.

వాస్తవంగా గత డిజిపి అనురాగ్ శర్మ పదవీ విరమణ చేసినప్పుడు (2017 నవంబర్ 12న) హైదరాబాద్ కమిషనర్‌గా ఉన్న మహేందర్‌రెడ్డిని తాత్కాలిక ప్రాతిపదికన ఆ స్థానంలో నియమించారు. పోలీసు యాక్ట్‌ను మార్చి 10న గెజిట్‌లో ప్రచురించి 2018 ఏప్రిల్‌లో మహేందర్‌రెడ్డిని పూర్తిస్థాయి డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News