Sunday, December 22, 2024

ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -
- Advertisement -

పెషావర్ : ఇద్దరు పిల్లలున్న భారతీయ మహిళ అంజు, ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లి మంగళవారం అతనితో పెళ్లి చేసుకోవడమే కాక, మతంతోపాటు పేరును కూడా ఫాతిమాగా మార్చుకుంది. 34 ఏళ్ల ఫాతిమా ( అంజు) తన 29 ఏళ్ల పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా ఇంట్లోనే ఉంటోంది. పాక్ లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా లోని ఎగువ ధీర్ జిల్లాలో నస్రుల్లా నివాసం ఉంది. వీరిద్దరూ 2019లో ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులయ్యారు. స్థానిక జిల్లా , సెషన్స్ జడ్జి కోర్టులో అత్యంత భద్రతల మధ్య వివాహం చేసుకున్నారు.

ఇస్లాం మతం లోకి ఆమె మారిన తరువాత చట్టబద్ధంగా నిఖా జరిగిందని దిర్ జిల్లా మొహర్ సిటీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఆఫీసర్ మొహమ్మద్ వాహబ్ చెప్పారు. నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, న్యాయవాదుల ముందు కోర్టులో వీరి వివాహం జరిగింది. తరువాత భద్రత కారణాల దృష్టా కోర్టు నుంచి ఆమె అత్తవారింటికి తీసుకెళ్లారు. సోమవారం ఈ జంట దిర్ జిల్లా లోని లావారి సొరంగాన్ని చూడడానికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ కైలర్ గ్రామంలో జన్మించిన అంజు రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఉండేవారు. పాకిస్థాన్‌లో ఆమె క్షేమంగా ఉంటున్నట్టు వీడియో దృశ్యాలు కనిపిస్తున్నాయి. ‘ నేనిక్కడకు చట్టబద్ధంగానే వచ్చాను. ప్లాను ప్రకారం రెండు రోజులని కాకుండా అకస్మాత్తుగా బయలుదేరి వచ్చాను.

ఇక్కడ భద్రంగానే ఉన్నాను ” అని ఆమె వీడియోలో వెల్లడించింది. “నా బంధువులను, పిల్లలను వేధించవద్దని మీడియా వారిని వేడుకుంటున్నాను” అని ఆమె అభ్యర్థించారు. రాజస్థాన్‌కు చెందిన అర్వింద్‌ను అంజు వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. భారత్ నుంచి వాఘాఅత్తరి సరిహద్దు మీదుగా చట్టబద్ధంగా ఆమె పాకిస్థాన్‌కు వచ్చారు. ఆమె వీసా గడువు ఆగస్టు 20 వరకు మాత్రమే ఉంది. ఆ తరువాత ఆమె భారత్‌కు వచ్చేయాలి. నస్రుల్లా షెరింగల్ యూనివర్శిటీ సైన్సు గ్రాడ్యుయేట్. ఐదుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు.

అయితే స్థానిక అధికారులకు ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో తమ స్నేహంలో ప్రేమించుకోవడం అనే కోణం లేదని, ఆగస్టు 20న అంజు తిరిగి భారత్‌కు వస్తుందని నస్రుల్లా వివరించారు. ఆమె ట్రావెల్ డాక్యుమెంట్లు క్రమంగా ఉన్నాయని, నస్రుల్లాతో ఉండడానికి ఆమెకు అనుమతించడమైందని పోలీస్ అధికారి తెలిపారు. రాజస్థాన్ భివాండీలో విలేఖరులతో అంజు భర్త అర్వింద్ మాట్లాడుతూ గురువారం ఆమె జైపూర్ వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిందని, తరువాత ఆమె పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలిసిందని తెలిపారు. తిరిగి ఆమె ఇంటికి వస్తుందన్న ఆశాభావం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News