Monday, January 20, 2025

ఫాతిమా అయిన అంజూ.. పాక్ నుంచి భారత్‌కు తిరుగు పయనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతీయ యువతి అంజూ తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు ఫేస్‌బుక్ ఫ్రెండ్ పరిచయం అయ్యారు. పాకిస్థాన్‌లోని ఆ యువకుడిని పెళ్లిచేసుకునేందుకు అంజూ ఈ ఏడాది ఆరంభంలో రాజస్థాన్‌లోని తమ ఇంటిని వీడి పరాయి దేశానికి బయలుదేరారు. ఇరుదేశాల నడుమ ఉండే వాఘా అటారీ సరిహద్దుల మీదుగా అర్థరాత్రి దాటిన తరువాత బయలుదేరారు. రాజస్థాన్‌లోని సొంత పట్టణానికి ఇంకా చేరుకోలేదు. అయితే తిరిగి స్వదేశానికి ఎందుకు వస్తున్నారని, ముఖానికి మేలి ముసుగు ధరించి ఉన్న అంజూను విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆమె ఎటువంటి బదులు ఇవ్వలేదు. చెప్పేందుకు ఏమీ లేదని ముగించారు. సంతోషంగానే ఉన్నానని , ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదన్నారు. రాజస్థాన్‌లోని భివాండీ నివాసి అయిన అంజూకు అంతకు ముందు అరవింద్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరు సంతానం కూడా ఉంది. కొడుకుకు 15 ఏండ్లు, కూతురికి నాలుగు ఏండ్లు. అయితే 2019లో అంజూకు పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్ల్లాతో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడి, ప్రేమకు మరో పెళ్లికి దారితీసింది.

కుటుంబానికి ముందుగా చెప్పకుండానే ఆమె జూన్‌లో పాకిస్థాన్ వెళ్లింది. నస్రుల్లాను కలిసింది. జైపూర్‌కు వెళ్లుతున్నట్లు చెప్పిన తన భార్య చివరికి పాకిస్థాన్‌లో ఉందని తెలిసిందని అరవింద్ అప్పట్లోనే ప్రకటించారు. అక్కడ ఆమె మతం మార్చుకుని ఫాతిమా అయి, ప్రేమికుడిని పెళ్లాడింది. పాకిస్థాన్‌లో పెళ్లి తరువాత ఆమె మానసికంగా దెబ్బతింది. తరచూ తన పిల్లలను చూడాలని ఉందని చెపుతూ వచ్చింది. ఈ విషయాన్ని రాజస్థాన్‌లోని తన బంధువులకు తెలిపింది. భర్త నస్రుల్లాతో ఇండియాకు రావడం వీసా క్లిష్టతతో వీలుకాని పరిస్థితి ఏర్పడింది. తరువాత అక్టోబర్‌లోనే ఒంటిరిగా భారత్‌కు రావాలనుకున్నా వీసా దొరకలేదు. ఇప్పుడు వీలయింది. అయితే ఇక్కడి ఆమె మునుపటి భర్త అరవింద్ వైఖరి ఏమిటనేది వెల్లడికాలేదు. పిల్లలతో కలిసి ఇప్పుడు అరవింద్ ఎక్కడుంటున్నారు? మారిన అంజూను తిరిగి తన జీవితంలోకి ఆహ్వానిస్తారా? అనేది తేలలేదు. అయితే అంజూ తిరిగి దేశానికి వచ్చి ఎక్కడుంటారు? తన పిల్లలను ఏ విధంగా కలుస్తారు? ముందుగా తన పుట్టింటికి వెళ్లుతారా? వెళ్లితే వారు ఆమెను రానిస్తారా అనే పలు చిక్కు ప్రశ్నలకు ఎటువంటి సమాధానం వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News