- Advertisement -
హైదరాబాద్: అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశాయి. దీంతో కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్, ఇతర నేతలను అరెస్టు చేశారు. వరద బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వరదల్లో చనిపోయిన వారికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి రూ.20 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాసన సభ ముట్టడికి సెకండ్ ఎఎన్‌ఎంలు కూడా పిలుపునిచ్చారు. 16 ఏళ్లుగా పని చేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో ఆందోళన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురిని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Also Read: చెప్పుతో చెంపలు వాయించుకున్న కౌన్సిలర్ (వైరల్ వీడియో)
- Advertisement -