- ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్
భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంతో పాటు వివిధ రకాల ఏఎన్‌ఎంలను నోటిఫికేషన్ రద్దు చేసి ఎలాంటి షరతులు లేకుండా భేషరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ డిమాండ్ చేశారు.
9వ రోజు సమ్మెలో భాగంగా జులై 26న ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్(పేపర్లను) కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న 2వ ఏఎన్‌ఎంలతో పాటు వివిధ రకాల ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా సమయంలో ఏఎన్‌ఎంలను దేవుళ్ళతో సమానంగా పోల్చారని ఇప్పుడు వాళ్ళను చిన్న చూపు చూస్తూ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.
బీమా సౌకర్యం రూ.50లక్షలు కల్పించాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ లెక్ఛరర్లు, విఆర్‌ఏలను ఏ విధంగా రెగ్యులర్ చేశారో అలాగే ఏఎన్‌ఎంలను బేషరతుగా రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం 16 జివో ద్వారా చేయొచ్చన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. జిల్లా ఏఎన్‌ఎంల యూనియన్ నాయకురాలు కృష్ణవేణి, సరళ, చంద్రకళ, పద్మ, సుజాత, శ్యామలతో పాటు 12 పిహెచ్‌సిల రెండవ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.