Friday, April 4, 2025

హైదరాబాద్‌లో అన్న క్యాంటీన్‌!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు సిబిఎన్ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అన్న క్యాంటీన్ కోసం మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో నిర్మాణ పనులు పూర్తి చేశారు. జులై మొదటి వారంలో ఇక్కడ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు.

ఏపీతో పాటు తెలంగాణలోనూ చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఫోరం ద్వారా కృషి చేస్తున్నట్లు అమర్ తెలిపారు. ప్రస్తుతం సిటీలో అన్న క్యాంటీన్ ను తాను ఒక్కడినే ప్రారంభిస్తున్నానని.. స్నేహితులు, దాతల సహకారంతో సిటీ అంతటా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News