- Advertisement -
ముంబై : సామాజిక కార్యకర్త అన్నాహజారే మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ఈనెల 14 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వం సూపర్ మార్కెట్లు, స్టోర్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకోవాలని అన్నాహజారే బుధవారం సీఎం ఉద్ధవ్ థాక్రేకు మరోసారి లేఖ రాశారు. మద్యం పాలసీపై పునరాలోచించుకోవాలని లేఖలో కోరానని, దానిపై స్పందించకుంటే ఈనెల 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌కు కూడా లేఖ రాశానని, ఆయన నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈనెల 3 న సీఎంకు లేక రాశానని, దానికి స్పందన రాకపోవడంతో గుర్తు చేసేందుకు రిమైండర్ లేఖ రాశానన్నారు.
- Advertisement -