Tuesday, April 15, 2025

మార్క్‌ శంకర్‌ పేరుమీద తిరుమలలో అన్నదానం.. అన్నా లెజినోవా భారీ విరాళం

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలో ఎపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం ఏర్పాటు చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం భోజనానికి రూ. 17 లక్షలను పవన్ సతీమణి అన్నా లెజినోవా విరాళంగా ఇచ్చారు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడటంతో.. నిన్న శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన అన్నా లెజినోవా.. స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా, అగ్ని ప్రమాదం తర్వాత స్థానిక ఆస్పత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స అందించారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో పలు పరీక్షలు చేసిన అనంతరం కుమారుడిని పవన్ దంపతులు హైదరాబాద్ కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News