Monday, December 23, 2024

ప్రియుళ్ల మోజులో ఉపాధ్యాయుడిని చంపిన కూతురు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని కన్నతండ్రిని కూతురు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దొరస్వామి(62) అనే ఉపాధ్యాయుడు సంవత్సరం క్రితం భార్య చనిపోవడంతో కూతురితో కలిసి ఉంటున్నాడు. కూతురు హరితను బిఎస్‌సి, బిఇడి చదివించాడు. కూతురు కోసం దాచిన నగదు, తన భార్య బంగారాన్ని ఆమె బ్యాంకు అకౌంట్‌లో వేశాడు. ఆమె రమేశ్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటుంది. బంగారు నగలు తాకట్టు పెట్టి రమేశ్‌కు 11.40 లక్షల రూపాయలు ఇచ్చింది. మరో యువకుడు సాయి కృష్ణకు కూడా 8 లక్షల రూపాయలు ఇచ్చింది. మరో యువకుడితో కూడా సన్నిహితంగా ఉండడంతో ఆమెకు పెళ్లి చేయాలని కన్నతండ్రి నిర్ణయం తీసుకున్నాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

గత గురువారం పెళ్లి విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంలో విచక్షణ కోల్పోయి రోటీ కర్ర తీసుకొని తండ్రి తలపై కూతురు పలుమార్లు బాదింది. ఇంట్లో నుంచి అరుపులు వినపడడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చేచూసేరికి దొరస్వామి రక్తపు మడుగులో కనిపించాడు. తన తండ్రి కాలుజారి పడ్డాడని చెప్పడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులకు కూడా తన తండ్రి కాలు జారి పడ్డాడని తెలపడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెను ప్రియుళ్లు ఉసిగొల్పడంతోనే కన్న తండ్రిని హత్య చేసి ఉంటుందని స్థానికులు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News