Saturday, November 23, 2024

దేశానికే అన్నపూర్ణ మన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : రైతు బాంధవుడు సిఎం కెసిఆర్ అని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఉప్పరిగూడ రైతు వేదిక వద్ద తెలంగాణ దశాభ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శేరిగూడ నుంచి ఎడ్ల బండిమీద స్తానిక ఎమ్మెల్యేతోపాటు మార్కెట్ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, వైఎస్ చైర్మన్ కల్వకోలు రవిందర్‌రెడ్డి , జిల్లా సర్పంచ్‌ల పోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ( ఉప్పరిగూడ సర్పంచ్)లు ర్యాలీగా వచ్చారు. సర్పంచ్ బూడిద రాంరెడ్డి సిఎం సందేశం చదివి వినిపించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బాందవుడు సిఎం కెసిఆర్ అన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతోనే రైతు బంధు, రైతుబీమా, పెట్టుబడి రాయితి ,సబ్సిడీ ఇవ్వడం జరిగిందని చెప్పారు.దేశంలో ఏ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోరుకుంటున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతు బంధు క్రింద రైతుల ఖాతాలో రూ.5.51 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని చెప్పారు.

సీనియర్ బిఆర్‌ఎస్ నేత క్యామామల్లేష్ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ రమణారెడ్డి ,తూర్పు డివిజన్ ఆర్డీఓ వెంకటాచారీ,ఎంపిపి కృపేష్ , ఉప్పరిగూడ , మంగళ్‌పల్లి చైర్మన్లు టేకుల సుదర్శన్‌రెడ్డి , మంచిరెడ్డి మహెందర్‌రెడ్డి, మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఆకుల యాదగిరి,మమత శ్రీనివాస్‌రెడ్డి , బర్థకి జగన్నాధం, రైతు బంధు కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి , డైరక్టర్లు మిర్యాణం కిరణఫ్పా, మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు , ఏడి సత్యానాయణ, తహశీల్దార్ రామోహాన్‌రావు, ఎంపిడిఓ క్రాంతి కిరణ్, ఎఓ వరప్రసాద్‌రెడ్డి, ఏఈఓ రఘు , తదితరులు పాల్గొన్నారు.
ముకునూర్‌లో రైతు దినోత్సవ వేడుకలు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండల పరిధిలోని ముకునూర్‌లో సర్పంచ్ శివరాల జ్యోతి రాజు , ఏఈఓ శ్రావన్ కుమార్ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద ఘనంగా రైతు దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమానికి రాచకొండ దండుమైలారం పిఏసిఎస్ చైర్మన్ బిట్ల వెంకట్‌రెడ్డి , వైఎస్ చైర్మన్ కాంటేకార్ ఈశ్వర్‌జీ హాజరయ్యారు.. ముందుగా గ్రామంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ,చైర్మన్ బిట్ల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవుడు సిఎం కెసిఆర్ అని అన్నారు. సర్పంచ్ మల్లేశ్వరీ , ఎంపిటీసీ గంగిరెడ్డి జ్యోతి బాస్కర్‌రెడ్డి, పుష్పలత ,రైతులు , డైరెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News