యష్ రంగినేని మాట్లాడుతూ.. ‘విజయ్‌తో డియర్ కామ్రేడ్ ప్రారంభమైనప్పుడు చిన్న సినిమాగానే స్టార్ట్ అయింది. ఆ తరువాత విజయ్ స్టార్డం పెరిగి పెద్ద సినిమాగా మారింది. నాకున్న ప్యాషన్‌తోనే ఇలా చిన్న చిత్రాలు చేస్తున్నాను. నాక్కూడా పెద్ద హీరోలతో చేయాలని ఉంది. ఆ చాన్స్ వస్తే చేస్తాను. చెందు తీసిన ఓ పిట్ట కథ ఫ్లాప్ అయిందని నేను అనుకోవడం లేదు. కరోనా రావడంతో థియేటర్లోంచి త్వరగా పోయింది. కానీ ఓటీటీలో మాత్రం బాగానే ఆడింది. ఓ పిట్టకథ చూశాక, నచ్చాకే ఈ సినిమాను ఓకే చేశాం. ఈ సినిమా కథ కూడా బాగుంటుంది. నాకు నచ్చింది. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత హిట్ అయినా కూడా వారం కంటే ఎక్కువగా ఆడటం లేదు. ఫస్ట్ మేం ఈ సినిమాను మల్టీ స్క్రీన్లలోనే రిలీజ్ చేస్తున్నాం. కొన్ని సెలెక్టెడ్ ప్లేస్‌లోనే సింగ్ స్క్రీన్లలోనే వేస్తున్నాం.
చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టం లేని టైంలో కథను చెప్పాలని అనుకున్నాం. రెట్రో ఫీలింగ్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే 80ల నేపథ్యంలో కథను చెప్పాను. చిన్నా, పెద్దా అందరూ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నేను నిజ జీవితంలో చూసిన పాత్రలు, మా ఊర్లోని సంఘటనలు చూసి ఇన్ స్పైర్ అయి రాసుకున్న కథ. ఇందులోని సీన్స్ కూడా ఎంతో సహజంగా, మన చుట్టూ జరిగినట్టే ఉంటాయి. చాలా సింపుల్‌గా చేశాను అని చెబితే అది అబద్దం అవుతుంది. మీరు రెండు గంటల సినిమా చూశారు. నేను దానికి రెండేళ్లు కష్టపడతాను. టీం అంతా బాగా పని చేసింది. కాబట్టి ఇంత బాగా వచ్చింది. ఒక ఊరిలో షూటింగ్ చేయలేదు. 80 లొకేషన్లలో సినిమాను తీశాను. లొకేషన్ల రెక్కీ కోసమే మూడు నెలలు పట్టింది. నిర్మాత సలహాలు, సూచనల వల్లే బడ్జెట్ కూడా అదుపులో ఉంది.
చైతన్య రావ్ మాట్లాడుతూ.. ‘నా పాత్రను చెందు గారు అద్భుతంగా డిజైన్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ గారి సినిమాలు చూశాను. నా పాత్రలోని సెన్సిబిలిటీస్‌ను డైరెక్టర్ వివరించేవారు. వర్క్ షాప్ కాక ముందే నాకు క్లియర్‌గా వివరించారు. నాకు ఇలాంటి చాన్స్ దొరికినప్పుడు ఎక్కడా తప్పు చేయొద్దని అనుకున్నాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాను. నాది కరీంనగర్ అయినా కూడా నేను ఆస్ట్రేలియా, హైద్రాబాద్‌లో ఉన్నాను. కథ చెప్పినప్పటి నుంచే ఆ యాసలో మాట్లాడాలని డైరెక్టర్ చెప్పాడు. వర్క్ షాప్‌లో ప్రాక్టీస్ చేశాను. డైరెక్టర్ దగ్గరుండి నాకు హెల్ప్ చేశారు. కీడా కోలా, పారిజాతపర్వం, షరతులు వర్తిస్తాయ్, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చెందు గారు 30 వెడ్స్ 21 ఇంకా చూడలేదు. నాకు మళ్లీ ఇలాంటి పాత్రే వచ్చింది. నాకు నిజంగానే ఇది హిట్ ఫార్మూలా అయితే బాగుంటుంది’ అని అన్నారు.
లావణ్య మాట్లాడుతూ.. ‘గౌతమి పాత్ర నాకు చాలెంజింగ్‌గానే అనిపించింది. భాష నాకు ప్రాబ్లం కాలేదు. కానీ మాట్లాడే విధానం, నడవడిక ఇలా అన్నింటి గురించి దర్శకుడు ముందే ఇన్ పుట్స్ ఇచ్చారు. పాత సినిమాలను చూడమని సలహా ఇచ్చారు. నాకు విలేజ్ గర్ల్ పాత్రలంటే ఇష్టం. ఇలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం. అశ్లీలత అనేది లేకుండా సినిమా తీశామనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అవి వింటుంటే మాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.