Monday, December 23, 2024

జూలై 21న విడుదలకు సిద్ధమవుతున్న”అన్నపూర్ణ ఫోటో స్టూడియో”

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిల్, కాన్సెప్ట్ తో పాటు లిరికల్ పాటలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైన సందర్భంగా

నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ…గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. పీరియాడిక్ సినిమాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో సినిమా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. జూలై 21న మా సినిమాను విడుదల చేస్తాం. అన్నారు

చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ – పంకజ్ తొట్టాడ, ఎడిటర్ – డి వెంకట్ ప్రభు, పీఆర్వో – జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత – యష్ రంగినేని, రచన దర్శకత్వం – చెందు ముద్దు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News