Wednesday, January 22, 2025

అన్నారం బ్యారేజి బుంగల పూడ్చివేత పనులు పూర్తి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా గోదావరి నదిపై నిర్మించిన అన్నారం బ్యారేజిలో బుంగల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో బ్యారేజి 28,38 పియర్‌ల వద్ద పెద్ద ఎత్తున నీటి బుంగలు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు ఇసుక బస్తాలు , రాళ్లు అడ్డుగా వేసి బుంగలను తాత్కాలికంగా పూడ్చివేసి నీటి లీకేజిని ఆపగలిగారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నేతృత్వంలో మంత్రుల బృందం అన్నారం బ్యారేజిని తనిఖీ చేసింది. బ్యారేజిలో ఏర్పడిన బుంగల వల్ల ప్రమాదం లేదని అభిప్రాయపడింది.

ఈ బ్యారేజిని నిర్మించిన కాంట్రాక్టు కంపెనీతోనే గ్రౌటింగ్ ప్రక్రియ ద్వారా బుంగలను శాశ్వతంగా పూడ్చివేయించాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ఇందులో భాంగంగానే ఆప్కాన్ కంపెనీ అన్నారం బ్యారేజి బుంగల పూడ్చివేత ప్రక్రియను చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హెలికాప్టర్ ద్వారా పాలియూరిధిన్ అనే కెమికల్‌ను తెప్పించింది. బ్యారేజి 38,28 పిల్లర్ల వద్ద బుంగలను గ్రౌటింగ్ పద్ధతి ద్వారా పూడ్చివేయించింది. బ్యారేజి రిపేర్ల ప్రక్రయ ముగిసిందని, ఇకపై బ్యారేజిలో నీటిని నిలుపుకోవచ్చని వెల్లడించింది. బ్యారేజిని పూర్థి స్థాయి సామర్ధం మేరకు నీటితో నింపినప్పటికీ ఎటువంటి లీకేజిలు ఉండవని భరోసానిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News