Sunday, January 19, 2025

అన్నారం పిల్లర్లు కుంగుతాయని ఎన్‌డిఎస్‌ఎ రిపోర్ట్: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: మేడిగడ్డలాగే అన్నారం పిల్లర్లు కుంగుతాయని, ఆ బ్యారేజీలో నీళ్లు ఖాళీ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల రంగంపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉతమ్ మాట్లాడారు. అన్నారం బ్యారేజ్, మల్లన్నసాగర్ కు కూడా ప్రమాదం పొంచి ఉందని,  కాళ్లేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్యాలిటీ కంట్రోల్ లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ మూడేళ్లకు కూలిందని విమర్శలు గుప్పించారు. విజిలెన్స్, ఎన్‌డిఎస్‌ఎ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరంలో అవినీతిని కాగ్ రిపోర్ట్ కూడా బయటపెట్టిందని, 2019లో బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసినా కూడా కనీస పర్యవేక్షణ లేదని మండిపడ్డారు. బ్యారేజ్ కట్టిన మూడేళ్లకే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని ఎందుకు పెంచారో చెప్పడం లేదని నిలదీశారు. 81 వేల కోట్లకు సిడబ్ల్యుసి అనుమతి ఉందని, డిపిఆర్ఎస్ ముందే 25 వేల కోట్లు ఎలా పెంచారని ఉత్తమ్ తప్పు పట్టారు. ఇప్పుడు మాత్రం ఆర్థిక భారం భరించలేనంతగా ఉందన్నారు. మేడిగడ్డ నిర్మాణం, డిజైన్, నిర్మాణం చాలా దారుణంగా ఉందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News