Monday, December 23, 2024

అన్నారం ట్రయల్ రన్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

మొదటి పంప్ మరమ్మతు పూర్తి పూర్తి సామర్థం మేరకు నీళ్లు ఎత్తిపోసిన పంప్
ఈనెల చివరి నాటికి కన్నెపల్లి సిద్ధం అధికారులను అభినందించిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: అన్నా రం పంప్‌హౌస్ విషయంలో సిఎం కేసిఆర్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుని పంప్‌హౌస్ పనులను సకాలంలో పూర్తి చేయించారు. పంప్ హౌస్ మొదటి పంపును ఇంజినీర్లు శనివారం జయప్రదంగా తిప్పడం జరిగింది. పం ప్ డిజైన్ మేరకు డిశార్జ్ సామర్థ్ధంతో నీటిని ఎత్తి పోసిందని ఈ కార్యక్రమా న్ని పర్యవేక్షిస్తున్నప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటా రెడ్డి, ఇం జినీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. పంపు పనితీరు పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక వరుసగా ఒకదాని తర్వాత మరొకటి నడపడం జరుగుతుందని వారు ప్రకటించారు. అదే వి ధంగా కన్నెపల్లి పంప్ హౌస్‌లో కూడా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. అక్కడి పంపులను కూడా అ క్టోబర్ చివరి నాటికి తిప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించా రు. పథకాలపై ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రకటన చేసిందని, ప్రజలకు ఇచ్చి న మాట ప్రకారం అన్నారం పం హౌజ్ లో మొదటి పంపును జయప్రదంగా న డిపామని ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు.

ఈ కృ షిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కూడా ఈ విజయంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇంజినీర్లకు అభినందనలు తెలియజేశారు. రెండు నెలల కాలంలోనే అన్నారం పం ప్‌హౌస్ పునరుద్ధరణ జరిపినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ హర్షం వెలిబుచ్చారు సలహాదారు పెంటా రెడ్డి , ఈఎన్‌పి వెంకటేశ్వర్లు ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగాటా పంపుతాను కూడా నడిపించాలని సిఎం కోరారు.రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్‌రావు కూడా అన్నారం పంపుల పునరుద్దరణ ప్రక్రియ జయప్రదం అయినందుకు హర్షం వెలిబుచ్చారు. ఇంజనీర్లకు మంత్రి హరీష్‌రావు అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News