Monday, December 23, 2024

రెండు కుటుంబాల మధ్య జరిగే కథ..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా స్వప్న దత్ మాట్లాడుతూ.. “ఒక మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో అన్నీ మంచి శకునములే సినిమా చేశాం. వేసవిలో మన అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ పది రోజులు హాయిగా గడిపి వస్తే ఆ జ్ఞాపకం ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలా వుంటుంది.

ఇది హీరో, హీరోయిన్ సినిమా కన్నా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. రెండు కుటుంబాలకు ఎలాంటి పాత్రలు కావాలో అలాంటి పాత్రలు ఇందులో చక్కగా కుదిరాయి”అని అన్నారు. ప్రియాంక దత్ మాట్లాడుతూ “ఈ సినిమా అంతా కునూర్ హిల్ స్టేషన్‌లో జరుగుతుంది. ఎప్పటి నుంచో హిల్ స్టేషన్ లో ఒక ఫ్యామిలీ కథ చేయాలని ఉండేది. నందిని చెప్పిన కథ దీనికి సరిగ్గా సూట్ అయింది. హిల్ స్టేషన్‌లో సినిమా చేయాలనే కోరిక ‘అన్నీ మంచి శకునములే’తో తీరింది. ఇక మేము చేస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ 70 శాతం షూటింగ్ పూర్తయింది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News