Sunday, December 22, 2024

ఇక ‘అన్నీ మంచి శకునములే’

- Advertisement -
- Advertisement -

స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకలావేదిక లో ఆహ్లాదకరంగా జరిగింది. దర్శకులు నాగ్‌అశ్విన్, అనుదీప్, హను రాఘవపూడి, నేచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ “ఈ సినిమా దర్శకురాలు నందినీ స్పెషల్ మూవీ చేసింది. నందినికి మరో నాని… సంతోష్ రూపంలో దొరికాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి”అని అన్నారు.

సంతోష్ శోభన్ మాట్లాడుతూ “నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించడం చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా చూశాక ప్రేక్షకుల మనసు తేలికవుతుంది”అని తెలిపారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ “అశ్వనీదత్ నాన్నలా పెద్ద దిక్కులా గైడ్ చేశారు. షావుకారు జానకితో పనిచేయడం గర్వంగా వుంది”అని చెప్పారు. స్వప్నా దత్ మాట్లాడుతూ ఈ సినిమా చూస్తే మన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మామిడికాయ తిన్నంత హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, ప్రియాంక దత్, మాళవిక నాయర్, సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమి, వాసుకి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News