Sunday, January 19, 2025

‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ విడుదల..

- Advertisement -
- Advertisement -

సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్ వికె, బివి నందిని రెడ్డి, స్వప్న సినిమా.. క్రేజీ కాంబినేషన్. ‘అన్నీ మంచి శకునములే’ అనే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం వీరందరూ కలిసి పనిచేశారు. సమ్మర్‌లో బిగ్గెస్ట్ అట్రాక్షన్స్‌లో ఒకటిగా మే 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ ట్రాక్ లాంచింగ్ ఈవెంట్ ని ఉగాది పండగ వాతావరణంలో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. టైటిల్ ట్రాక్…హార్ట్ వార్మింగ్ కంపోజిషన్, మెస్మరైజింగ్ వాయిస్, అర్థవంతమైన సాహిత్యంతో అందరినీ అలరిస్తోంది.

ఈ పాటని కార్తీక్ పాడగా.. రెహమాన్ సాహిత్యం అద్భుతంగా వుంది. నిర్మాత అశ్వినీదత్ తో పాటు డైరెక్టర్ బివి నందిని రెడ్డి, సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, వాసుకి.. తదితరులు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ కు హాజరయ్యారు . ఈ సందర్భంగా దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. “రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. వేసవిలో మన అమ్మమ్మ ఇంటికి వెళ్తే ఎంత హాయిగా వుంటుందో అలాంటి కథ ఇది”అని అన్నారు. నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ.. “నందిని రెడ్డి అద్భుతంగా ఈ చిత్రాన్ని తీసింది. రాజేంద్ర ప్రసాద్, నరేష్ చక్కని పాత్రలు పోషించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ అద్భుతంగా నటించారు”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News