Thursday, January 23, 2025

నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో జిల్లెల అన్నికరెడ్డి పేరు నమోదు

- Advertisement -
- Advertisement -

Annikareddy is listed in Nobel World Records

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి చిన్నవయస్సు పారాగ్లైడర్‌గా నోబెల్ వరల్డ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకున్న జిల్లెల అన్నికరెడ్డిని రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. జిల్లెల అన్నికరెడ్డి హైదరాబాద్ ఉప్పల్‌లోని మెరిడీయన్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 04వ తేదీ 2022వ తేదీన మహారాష్ట్రలోని కాంషేట్‌లో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాగాగైడర్ పోటీల్లో పాల్గొన్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు (11 సం.లు 7 నెలలు) పారాగైడర్‌గా రికార్డును నమోదు చేసింది. ఈ కార్యక్రమంలో అన్నికరెడ్డి తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి, ప్రత్యూష రెడ్డి, జూపల్లి భాస్కర్‌రావు, రాములు, లక్ష్మణ్, డా.రామ్మోహన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News